లలిత ప్రియ

Book Name: లలిత ప్రియ
Author: N.Shravan Kumar
Format: పేపర్ బ్యాక్

Book Cover & Title:
ఈ బుక్ కవర్ image అందమైన painting. అందులోనే కథలోని main characters కూడా ఉన్నాయి. Cover image చూడగానే readersకి కథపైన ఒక అవగాహన రావొచ్చు.

Sober colors అందులో నీలం & కాషాయతో image రంగుల combination –  ఆనందం, ఆత్రుత & ఆరాధనని చూపిస్తూ,  backgroundలో కళ్ళకి ఇంపుగా ఉండే scenery, నది & పడవ , ఇలా అన్ని elementsతో రచయిత మంచి imageని  వాడారు. 

About the book: 
బుక్ titleకి తగ్గట్టే లలితంగా, soft love storyతో నచ్చే విధంగా ఉంది. కేవలం 5 charactersతో మంచి కథని అందించారు.

Narration:
ఒక perfect fiction కథకి కావలసిన అన్ని హంగులు ఈ లలితప్రియలో ఉన్నాయి. నదీ తీరాన ఉండే ఊరు, పడవ నడుపుకునే కథానాయకుడు, సున్నితమైన మనసు కల కథానాయిక, వారి మధ్యన ఏర్పడే unconditional love, స్వార్ధంలేని స్వచ్ఛమైన friendship ఇలా చాలా themes కథలో ప్రతి పేజీలో ఉన్నాయి. ఎక్కడ ఆపకుండా అలా హాయిగా చదువుకుంటూ వెళ్లే paceతో ఈ కథని narrate. చేశారు. 

కథ మొదట్లో హీరో రాంకిషన్ voiceతో మొదలవుతుంది. కథ వెళ్తున్న కొద్దీ, female protagonist voice కూడా కలుస్తుంది. ఈ person transition చాలా తేలికగా, తెలియకుండా జరుగుతుంది. అందుకే ముందర readerతో రాంకిషన్ మాట్లాడితే, next లలిత ప్రియ మాట్లాడుతుంది. ఇది బావుంది.

Characters:
కథలో  రాంకిషన్ & శేఖర్ మధ్యలో ఉన్న స్నేహం చాలా బాగా చూపించారు రచయిత. ఎటువంటి భేషజాలు లేకుండా, మానవత్వం తో కూడిన ప్రేమని చాలా చక్కగా చూపించారు. అలాగే లలిత ప్రియ,రాంకిషన్ మధ్యన జరిగే innocent ప్రేమని అందంగా చూపించారు.

What did I like:
1. కథ జరిగే ఊరు, ప్రదేశం.
2.రాంకిషన్ నిజాయితీ.
3.Unconditional లవ్ అనే అంశం 

What could have been better:  
1.లలిత ప్రియ బ్యాక్ స్టోరీలో ఇంకా కొంచం depth  & intensity ఉంటే బావుండేది.
2. Caste  గురించి శేఖర్ పెళ్ళి విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కొంచెం దెతైలేదుగా రాసి ఉంటే బావుండేది.

Who can read:
సౌమ్యంగా, నెమ్మదిగా చిన్న నది పాయ పారుతున్నట్లు, మనసుకి మంచి హాయి భావం కలిగే ప్రేమకథల్ని ఇష్టపడేవారికి ఈ లలితప్రియ తప్పక నచ్చుతుంది.



Leave a comment

Listed among the 100 Best Contemporary Book Blogs and Websites